Spain volcano eruption: నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం - స్పెయిన్ అగ్నపర్వతం
స్పెయిన్, లా పల్మాలోని కంబర్‌వీజా అగ్నిపర్వతం నుంచి మరోసారి పెద్దఎత్తున లావా ఎగిసి పడుతోంది(Spain volcano eruption). చుట్టుపక్కల ప్రాంతమంతా పూర్తిగా దట్టమైన పొగలతో నిండిపోయింది. ఇప్పటికే దాదాపు 7,500 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లావా కారణంగా 2 వేలకుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిపర్వతం(Spain volcano) నుంచి పొంగి వస్తున్న లావా సుమారు 2వేల ఎకరాలకుపైగా పంట భూమిని నాశనం చేసింది. సెప్టెంబర్ 19న కంబర్ వీజా అగ్నిపర్వతం విస్ఫోటం చెందగా అప్పటి నుంచి లావా ఎగిసి పడుతోంది.