ట్రక్కు దొంగ కోసం పోలీసుల ఛేజ్ .. చివరకు ఏమైంది? - truck chase in america
అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో ఓ భారీ ట్రక్కును దొంగిలించి పారిపోతున్న దొంగను పోలీసులు వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక ట్రక్కు ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రక్కును రోడ్డుపైనే వదిలేసి.. దుండగుడు పరారయ్యాడు. విపత్తు నిర్వాహక బృందం.. ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. డ్రోన్ల సహాయంతో నిందితుడు.. ఎక్కడున్నాడో తెలుసుకుని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.