కార్చిచ్చుకు లక్షల ఎకరాలు దగ్ధం- ముగ్గురు మృతి - California wildfire
అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు ఈశాన్యంలో కార్చిచ్చు కారణంగా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. పర్వత ప్రాంతంలో మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. నగరం చుట్టూ 25 మైళ్ల విస్తీర్ణంలోని నివాస, మైదాన ప్రాంతాల్లో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. వందలాది ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. పగలు రాత్రి తేడా లేకుండా సహాయక సిబ్బంది కృషిచేస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావటం లేదు. ఇప్పటికే వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.