హైవేపైనే విమానం అత్యవసర ల్యాండింగ్! - ఎమర్జెన్సీ ల్యాండింగ్
అమెరికా చికాగోలోని ఒక చిన్న విమానం గురువారం ఉదయం అత్యవసర ల్యాండింగ్ అయింది. రద్దీగా ఉండే టోల్ హైవే పైనే విమానాన్ని దింపాడు పైలట్. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా అత్యవసర ల్యాండింగ్ కావాల్సి వచ్చిందని ఇల్లినాయిస్ పోలీసులు తెలిపారు. విమానంలోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.