దారుణం.. 1,428 డాల్ఫిన్లను వేటాడి చంపేశారు! - ఫెరో ఐలాండ్
ఐస్లాండ్, ఫెరో దీవుల్లోని (Faroe Islands) ఈస్టోయ్ ద్వీపంలో 1,428 డాల్ఫిన్లను స్థానికులు వేటాడారు. దీంతో సముద్ర తీరం రక్తసిక్తమైంది. ఇక్కడ నాలుగు శతాబ్దాలుగా స్థానికులు మాంసం, కొవ్వు కోసం ఈ సముద్ర క్షీరదాల వేట (Faroe Islands dolphin killing) కొనసాగిస్తున్నారు. ఏటా వెయ్యికి పైగా డాల్ఫిన్లను వేటాడతారు. అయితే ఒకేసారి 1,428 డాల్ఫిన్లను చంపడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మరణించిన డాల్ఫిన్లు సాధారణ డాల్ఫిన్లలా కాకుండా.. తెలుపు, నలుపు రంగుల కలయికతో ఉంటాయి. గతేడాది ఇలాంటి 35 డాల్ఫిన్లు వేటకు బలికాగా.. ఇప్పుడు భారీ స్థాయిలో జీవులు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.