పొటామక్ నదిలో 'క్రిస్మస్ తాత' చక్కర్లు - పొటామక్ నదిలో స్కీయింగ్ చేసిన క్రిస్మస్ తాత
అమెరికాలో క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్... నీటిలో స్కీయింగ్ చేశారు. పొటామక్ నదిలో ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి శాంటాక్లాజ్ దుస్తులు ధరించిన వ్యక్తి సహా మరికొందరు పాల్గొన్నారు. 33 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని 1986లో ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1986లో ఓ వ్యక్తి తన స్నేహితులతో పందెం కాసి ఓడిపోయాడు. దీంతో శాంటాక్లాజ్ వస్త్రాలతో నీటిలో స్కీయింగ్ చేస్తానని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు నిర్వాహకులు.