ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. 80 మీటర్ల ఎత్తులో 'రోప్వాక్'
rope walking: రియో డి జెనిరోలో ఫ్రాన్స్ రోప్వాకర్ నాథన్ పౌలిన్ ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేశాడు. బాబిలోనియా హిల్, ఉర్కా హిల్ మధ్య 80 మీటర్ల ఎత్తులో సన్నని తాడుపై నడిచాడు. ఎలాంటి రక్షణ లేకుండా 500 మీటర్ల దూరం నడిచి ఈ సాహసయాత్ర పూర్తి చేశాడు. ఈ సాహసం పూర్తి చేయడం తనకు ఓ కలలా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.