'కొలంబస్'కు నిరసన సెగ- విగ్రహం ధ్వంసం - Richmond protest today news
ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా చేపడుతున్న ఆందోళనల్లో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. అమెరికా వర్జీనియా రాష్ట్రం రిచ్మండ్లో క్రిస్టఫర్ కొలంబస్ ప్రతిమను ధ్వంసం చేశారు కొందరు నిరసనకారులు. బైర్డ్పార్క్లోని కొలంబస్ శిల్పాన్ని పెకిలించి.. సమీపంలోని నీటి సరస్సులో పడేరారు. 'జాతి సంహారానికి కొలంబస్ ప్రతీక' అని గోడపై రాశారు. అమెరికాను కనుగొన్న కొలంబస్ జ్ఞాపకార్థం.. రిచ్మండ్లో 1927 డిసెంబర్లో ఈ ప్రతిమను ప్రతిష్ఠించారు. ఇది అగ్రరాజ్యంలో తొలి కొలంబస్ విగ్రహం.