టీవీ షోలో రగడ- విపక్ష నేతకు చెంప దెబ్బ - Kal Tak talk show
పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేత డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవాన్.. ఆ దేశానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు ఎంఎన్ఏ ఖాదీర్ ఖాన్ మండోఖైల్ చెంప చెళ్లుమనిపించారు. ఓ వార్తా ఛానెల్ నిర్వహించిన టీవీ షోలో ప్రభుత్వ పాలనపై వాగ్వాదానికి దిగిన ఈ నేతలిద్దరు.. తర్వాత ఘర్షణ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.