నల్లజాతీయుడికి న్యాయం కోసం మిన్నంటిన నిరసనలు - పోలీసులపై అమెరికా ప్రజల తిరుగుబాటు
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ప్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మృతుడికి న్యాయం చేయాలంటూ.. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఎదురుగా చేపట్టిన ఆందోళనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని చోట్ల నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అట్లాంటాలో పోలీసు కారును తగులబెట్టిన ఆందోళనకారులు.. పోలీసులతో గొడవపడ్డారు. న్యూయార్క్‌లో జరిగిన ఘర్షణలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.