ఇజ్రాయెల్లో ఆగని నిరసనలు-ప్రధాని రాజీనామాకు డిమాండ్
అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. 5 నెలలుగా దేశంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఆందోళనలు చేపడుతున్నారు. జాతీయ జెండాలు చేతబూని నిరసన తెలుపుతున్నారు. కరోనాను కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని, ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగిత తీవ్రస్థాయిలో ఉందన్నారు. ప్రధాని మాత్రం ఆందోళనలు చేస్తున్నవారిని 'అరాచకులు, లెఫ్టిస్టులుగా అభివర్ణించారు.