బోరిస్ జాన్సన్ ఎన్నికపై లండన్లో నిరసనల హోరు - london protests
బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయంపై... ప్రధాని బోరిస్ జాన్సన్కు వ్యతిరేకంగా లండన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు వర్గాల ప్రజలు లండన్ వీధుల్లో ఆందోళనకు దిగారు. జాతివిద్వేశానికి, బోరిస్ జాన్సన్కు చరమగీతం పాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ దశలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చడం వల్ల నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పెద్ద ఘర్షణ తలెత్తింది. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.