ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన థాయ్‌లాండ్ - బ్యాంకాక్ ఆందోళనలు
థాయ్‌లాండ్‌లో పాలనా సంస్కరణలు కోరుతూ ఆందోళన బాటపట్టారు అక్కడి ప్రజలు. ప్రధానమంత్రి ప్రయూత్ చాన్-ఓచా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. వెయ్యిమందికిపైగా నిరసనకారులు బ్యాంకాక్‌లోని ఆర్మీ రెజిమెంట్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా చేస్తోన్న ఈ నిరసనల్లో ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చట్టాన్ని ఉల్లంఘించారంటూ వారిపై అభియోగాలు మోపారు.