నిరసనకారుడి తలపైకి సైకిల్ ఎక్కించిన పోలీస్
బ్రయోనా టేలర్ హత్య కేసులో పోలీసులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అమెరికా ప్రజలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. అట్లాంటా, సీటిల్, పోర్ట్లాండ్, లూయిస్విల్లే, కెంటకీ నగరాల్లో గురువారం వేలాది మంది ఆందోళనకారులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. పలువురిని అరెస్టు చేశారు. సీటిల్లో ఓ నిరసనకారుడి తలపై నుంచి పోలీస్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
Last Updated : Sep 27, 2020, 11:51 AM IST