ఉద్రిక్తతల మధ్య ట్రాన్స్జెండర్ల ప్రైడ్ పరేడ్ - ప్రైడ్ పరేడ్
పోలాండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బియావిస్టాక్ నగరంలో ట్రాన్స్జెండర్లు చేపట్టిన ప్రైడ్ పరేడ్‌ను అడ్డగించేందుకు పలువురు యత్నించారు. వారి నుంచి రక్షణ కల్పించేందుకు పరేడ్‌కు పోలీసులు భారీ భద్రత కల్పించారు. సుమారు 500 మంది పోలీసులతో రక్షణ కవచం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిరసనకారులు పరేడ్‌లో పాల్గొన్నవారి నుంచి జెండాలను లాక్కుని తగులబెట్టారు. ఎల్జీబీటీల పరుగుకు ఆటంకం కలిగించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల రక్షణలో ప్రైడ్ పరేడ్‌ను పూర్తి చేశారు ట్రాన్స్జెండర్లు.
Last Updated : Jul 21, 2019, 11:54 AM IST