పట్టాలపై కూలిన విమానం- ఇరుక్కున్న పైలట్.. ఎదురుగా రైలు.. - అమెరికా వార్తలు తాజా
Plane Crash Los Angeles: అమెరికా లాస్ఏంజెలెస్లో రైలు పట్టాలపై కూలిన విమాన పైలట్‌ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు రక్షించారు. అదే ట్రాక్‌పై ఓవైపు వేగంగా రైలు దూసుకొస్తుండగా.. చిన్నపాటి విమానంలో చిక్కుకున్న వ్యక్తిని అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆ పైలట్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తర్వాత సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి.. రైళ్ల రాకపోకలు కాసేపు నిలిపివేశారు. ట్రాక్‌పై పడిన విమాన శకలాల్ని తొలగించారు.