పిల్లలు కాదు పిడుగులు - అంతరించిపోయే జాతి
అంతరించిపోయే స్థితిలో ఉన్న దక్షిణ చైనా పులి పిల్లలను మధ్య చైనాలోని ఒక జూలో రెండు నెలల నుంచి పెంచుతున్నారు అధికారులు. ఇప్పుడవి 2.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాయి. 1950 వరకు చైనాలోని వివిధ ప్రాంతాల్లో విరివిగా కనిపించేవి. అడవి విస్తీర్ణం తగ్గుదలతో వాటి సంఖ్యా తగ్గుతూ వచ్చింది. 1996లో అంతరించేపోయే జాతుల జాబితాలో ఈ పులులు చేరాయి.