కరోనా వేళ చిలీలో నిరసనల సెగ - చిలీలో కొవిడ్-19 కేసులు
చిలీలో కరోనా సంక్షోభం వేళ అక్కడి ప్రజలు ఆందోళనలకు దిగారు. వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైనందున తమను మధ్యతరగతి వారిగా పరిగణిస్తూ.. సామాజిక భద్రత కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ నిరసనకారులు శాంతించని కారణంగా బాష్పవాయువు ప్రయోగించారు. ట్యాంకర్లతో నీళ్లు కొట్టి చెదరగొట్టారు పోలీసులు. అక్కడ ఇలాంటి సంఘటనలే ఇటీవల చోటుచేసుకున్నాయి. చిలీలో సోమవారం నాటికి 74,000 మంది వైరస్ బారిన పడగా.. 529మంది మృతి చెందారు.