తెలంగాణ

telangana

ETV Bharat / videos

జల్లికట్టు తరహాలో... అక్కడ బుల్​రైడ్​ పోటీలు! - USA

By

Published : Mar 2, 2020, 5:34 PM IST

Updated : Mar 3, 2020, 4:32 AM IST

అమెరికా ముస్సోరిలోని కాన్​సాస్​​ నగరంలో అన్​లీశ్​​ ది బీస్ట్​ పీబీఆర్​ ఛాంపియన్​షిప్​(బుల్​రైడ్​) ఆసక్తికరంగా సాగింది. భారత దేశానికి చెందిన తమిళనాడులోని జల్లికట్టు కంటే భయంకరంగా ఉంటుంది ఈ బుల్​రైడ్​. అయినా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోటీకి దిగారు యువకులు. ఒకవేళ బుల్​పై నుంచి కింద పడితే... గాయాలు తప్పవు. రైడింగ్​లో కొంతమంది కిందపడి తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే.. బ్రెజిల్​కు చెందిన లూకాస్​​ డివినో తొలిసారి విజేతగా నిలిచాడు. గతంలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన జెస్​ లాక్​వుడ్ ఈ సారి మూడో స్థానానికి పరిమితమయ్యారు.​ ఈ కార్యక్రమం తిలకించడానికి వేలాదిమంది ప్రేక్షకులు హాజరయ్యారు.
Last Updated : Mar 3, 2020, 4:32 AM IST

ABOUT THE AUTHOR

...view details