76 రోజులు.. ఒంటరిగా 4వేల కి.మీ సముద్రయానం - paddle
సముద్ర ప్రయాణం.. తెడ్డుపై ఒకటి, రెండు రోజులు చేయడం సరదాగా ఉంటుంది. అదే ఒంటరిగా రోజుల కొద్దీ చేయడమంటే మామూలు సాహసం కాదు. కానీ అదే చేశాడు స్పెయిన్కు చెందిన వ్యక్తి. అతడే 'ఆంటోనియో డీ లా రోసా'. తన వేసవి సెలవులను కాస్త భిన్నంగా గడపాలనుకున్నాడు. అంతే అమెరికా పశ్చిమ తీరం నుంచి పసిఫిక్ సముద్రం మీదుగా ఓ తెడ్డుపై హవాయీకు పయనమయ్యాడు. 76 రోజులు... రోజుకు 10 గంటల పాటు పడవ నడుపుతూ ఏకంగా 4,023 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. అందరితో ఔరా అనిపించాడు. ఆ మధురానుభూతిని కెమెరాలో బంధించి మనతో పంచుకున్నాడు.
Last Updated : Sep 28, 2019, 2:59 PM IST