అగ్నిపర్వతం విస్ఫోటం.. భారీగా ఎగసిన లావా - ఇటలీ అగ్ని పర్వతం
ఇటలీలో ఎట్నా అగ్నిపర్వతం మహోగ్రంగా విస్ఫోటనం చెందుతోంది. దీని ధాటికి దాదాపు పది కిలోమీటర్ల పరిధిలోని పట్టణాలు, గ్రామాలపై బూడిద, ఇతర అవశేషాలు విస్తరించాయి. బిలం నుంచి పెద్దఎత్తున లావా ఉబికి వస్తూ దిగువకు జారుతోంది. ఎర్రటి జ్వాలలు భయంగొల్పే రీతిలో ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున గాలులు వీస్తుండంటంతో అగ్నికీలలు మరింతగా విస్తరిస్తున్నాయి. అగ్నిపర్వతం సమీపంలోని ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Last Updated : Feb 22, 2021, 12:57 AM IST