ప్రధాని మెచ్చిన ఆ చిన్నారి 'కరోనా వీడియో' వైరల్ - 18000 more retweets for Nova Knight video
అమెరికా అలాస్కా రాష్ట్రం ఫెయిర్బ్యాంక్స్కు చెందిన ఐదేళ్ల చిన్నారి చెబుతున్న కరోనా పాఠాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తోటి పిల్లలకు నోవా నైట్ ముద్దుముద్దు మాటలతో వివరిస్తున్న వీడియోలు... కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టినీ ఆకర్షించాయి. నోవాపై ప్రశంసలు కురిపిస్తూ ఆ వీడియోను రీట్వీట్ చేశారు ట్రూడో.