వ్యాక్సిన్ సంబరాలతో కాంతులీనిన నయాగరా - niagara fireworks covid-19
న్యూయార్క్‌లో 70 శాతం మంది వయోజనులు కనీసం ఒక డోసు కరోనా టీకా తీసుకున్నట్లు అక్కడి గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటించారు. 70శాతం టీకా తీసుకోవడం అంటే పూర్వపు జీవితానికి న్యూయార్క్ చేరుకున్నట్లేనని ఆయన తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో న్యూయార్క్ ఘనంగా సంబరాలు జరుపుకుంది. నయాగరా జలపాతం వద్ద పెద్దఎత్తున బాణసంచా కాల్చారు అక్కడి ప్రజలు. మిరుమిట్లు గొలిపే ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ జిలుగు వెలుగుల్లో నయాగరా తన అందాన్ని మరింత రెట్టంపు చేసుకుంది.
Last Updated : Jun 16, 2021, 4:15 PM IST