అమెరికాలో 16 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా! - ఫైజర్ వ్యాక్సిన్
అమెరికాలోని న్యూయార్క్లో 16 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ ప్రారంభించారు అధికారులు. అయితే.. 18 ఏళ్ల లోపు 16, 17 సంవత్సరాల వయసు వారికి.. ఫైజర్ టీకా మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతానికి పైజర్ టీకానే అందిస్తున్నప్పటికీ.. త్వరలో ఒకే డోసు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తేనున్నట్లు న్యూయార్క్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హాస్టల్ విద్యార్థులకు ఈ సెమిస్టర్ పూర్తయ్యే నాటికి జాన్సన్ టీకా అందిస్తామని స్పష్టం చేసింది.