ఐఫిల్ టవర్ వద్ద అదిరే స్టంట్- సన్నటి తాడుపై నడుస్తూ..
ఫ్రాన్స్ పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్(Eiffel Tower) వద్ద ఓ వ్యక్తి.. శనివారం ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేశాడు. ఐఫిల్ టవర్(Eiffel Tower) మొదటి అంతస్తు నుంచి ట్రోకాడెరో స్క్వేర్ ప్రాంతంలోని ఓ థియేటర్ పైకప్పునకు కట్టిన సన్నటి తాడుపై నడిచాడు(Rope Walking) నాథన్ పౌలిన్ అనే రోప్వాకర్ ఆర్టిస్ట్. 70 మీటర్ల ఎత్తున 2.5 సెంటిమీటర్ల మందం ఉన్న తాడుపై 600 మీటర్ల దూరం నడిచి.. అతడు ఈ సాహస యాత్ర(Rope Walking) పూర్తిచేశాడు. మధ్యమధ్యలో తాడుపై పలు స్టంట్స్ చేసి కూడా పౌలిన్ అలరించాడు. ఈ సాహసం పూర్తి చేయడం తనకు ఓ కలలా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడతడు.