మయన్మార్ నిరసనలు ఉద్ధృతం- పోలీసుల బాష్పవాయు ప్రయోగం - మయన్మార్ ఆందోళనలు
మయన్మార్లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. యాంగూన్ నగరంలోని సాన్చాంగ్ రోడ్లపై బైఠాయించి నిరసన చేపట్టారు ఆందోళనకారులు. పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో బాష్పవాయువును ప్రయోగించారు. దీనికి వ్యతిరేకంగా రోడ్లపై అరటితొక్కలు విసిరారు నిరసనకారులు.