మయన్మార్ సైనిక తిరుగుబాటుపై ఆగని నిరసనలు - మయన్మార్ మాండలే సిటీ
సైనిక చర్యకు వ్యతిరేకంగా మయన్మార్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. సైన్యం హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మయన్మార్‌లోని ప్రధాన నగరాలు యాంగూన్, మాండలేలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నేతలను విడుదల చేయాలని, అక్రమ అరెస్టులను ఆపాలంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేపట్టారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరసనలు ఆపబోమని స్పష్టం చేశారు.