ఈ ఏడాది 'ఎర్త్ అవర్' పాటించింది ఆ ఒక్క దేశమే!
పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రష్యా రాజధాని మాస్కోలో శనివారం రాత్రి 'ఎర్త్‌అవర్' పాటించారు. చారిత్రక కట్టడాలైన క్రెమ్లిన్ బిల్డింగ్, సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్, ఒస్టాన్కినొ టీవీ టవర్, అధికారిక భవనాలైన 'ది హౌస్ ఆఫ్ గవర్న్మెంట్'లో విద్యుత్ దీపాలు ఆర్పేశారు. నగరంలో మరో 2 వేల భవనాల్లోనూ ఇలానే చేశారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏటా మార్చిలో ఒకరోజు ఈ కార్యక్రమాన్ని రాత్రి 8.30 గంటలనుంచి 9.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి కరోనా సంక్షోభం కారణంగా ఇతర ప్రధాన దేశాల్లో ఎర్త్ అవర్కు సరైన ప్రాధాన్యం దక్కలేదు.