నది ఉగ్రరూపం.. చెరువులైన రహదారులు
పశ్చిమ మధ్య అమెరికాలోని మిజోరి రాష్ట్రం జలమైంది. మిసిసిపి నది ఉద్ధృతంగా ప్రవహించి హన్నిబాల్ నగరం సహా మరిన్ని ప్రాంతాలను పూర్తిగా ముంచేసింది. 1993 తర్వాత నది నీటి మట్టం అత్యంత గరిష్ఠంగా 30.16 అడుగులకు చేరుకుంది. వీధులు వాగులను తలపిస్తున్నాయి. రహదారులన్నీ మునిగిపోయాయి. దాదాపు 400 రోడ్లు మూతపడ్డాయి. రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. వేలాది ఇళ్లు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఇసుక బస్తాలను అడ్డుకట్టగా వేస్తున్నారు స్థానికులు.