70 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ మినీట్రక్ - 70 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ మినీట్రక్
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 70 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైఓవర్ మీద వెళ్తున్న మినీట్రక్ అదుపు తప్పి కింద పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం ఈనెల 6న ఉదయం జరిగింది. రోడ్డుపై మంచు కారణంగా వాహనం అదుపు తప్పిందని అధికారులు వెల్లడించారు.