మెక్సికోలో పోలీసుకు నిప్పంటించిన నిరసనకారులు - protests against police in Mexico
మెక్సికోలో మాస్క్ ధరించలేదని ఓ యువకుడిని అరెస్ట్ చేసి అతని మృతికి కారణమైన పోలీసులకు వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. స్థానికంగా వందలమంది రోడ్లపైకి వచ్చారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఓ పోలీసు అధికారిపై పెట్రోలు పోసి నిప్పంటించారు నిరసనకారులు. వెంటనే స్పందించిన మిగతా పోలీసులు మంటలను ఆర్పారు. ఈ ఘర్షణల్లో రెండు పోలీసులు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.