రష్యాలో ఆన్లైన్లో ప్రతిపక్షాల నిరసనలు.. ఎందుకంటే? - రష్యా వార్తలు
కరోనాను సాకుగా చూపి పుతిన్ ప్రభుత్వం రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రష్యాలో లాక్డౌన్ అమల్లో ఉంది. లాక్డౌన్, రాజ్యాంగ సంస్కరణలకు నిరసిస్తూ రష్యాలో ప్రతిపక్ష నాయకులు ఆన్లైన్ వేదికగా నిరసన తెలిపారు. వాస్తవానికి ఈ నెల 22న పుతిన్.. తాను 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేలా రాజ్యాంగ సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఆ దేశంలో ఇప్పటివరకు 93,558 మంది కొవిడ్ బారిన పడగా.. 867 మంది ప్రాణాలు కోల్పోయారు.