రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తగలబెట్టిన సైన్యం! - మయాన్మార్ సైన్యం అరాచకాలు
ఐరాస అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రోజే భారీ ఎత్తున డ్రగ్స్, రసాయనాలను మయన్మార్ సైన్యం సీజ్ చేసింది. వీటి విలువ దాదాపు రూ.5000 కోట్లు ఉంటుందని ప్రకటించింది. వీటిలో హెరాయిన్, గంజాయి, మెథాంఫేటమిన్, కెటామైన్ ఉన్నాయి. యాంగూన్, మాండలే, టాంగీ నగరాల్లో పట్టుబడిన నిల్వలను ఒక్కచోట చేర్చి అందరూ చూస్తుండగానే తగులబెట్టింది. సైనిక తిరుగుబాటు అనంతరం ఏర్పాటైన ప్రభుత్వం.. అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు సింథటిక్ ఔషధాల ఉత్పత్తికి పెట్టింది పేరైన మయన్మార్.. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మాదకద్రవ్యాల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.