కాలిఫోర్నియా కార్చిచ్చు- అగ్నికి ఆజ్యం పోసిన వాయువు - ఘటనలో ముగ్గురు మృతి
అమోరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చుకు ముగ్గురు బలయ్యారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. అగ్ని కీలలకు గాలులు ఆజ్యం పోస్తున్నాయి. దీని వల్ల సుమారు 30 కట్టడాలు దెబ్బతిన్నాయి. పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. పర్యావరణ మార్పుల వల్ల కార్చిచ్చు ఘటనలు మరింత పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.