అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతితో చేలరేగిన నిరసన జ్వాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఓ అధికారి కూడా మరణించారు. కరోనా విజృంభిస్తున్నా లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా ఆందోళకారులు విభిన్న రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. కొంతమంది చేతులు వెనక్కి పెట్టి రోడ్డు మీద పడుకొని, మరికొందరు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపారు. బాణసంచా కాల్చి వినూత్నంగా ఆందోళనలు చేశారు. కాగా 338 మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆందోళనకారుడిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు.