కరోనా ఎఫెక్ట్: నిత్యావసరాల కోసం యూకే వాసుల పాట్లు - నిత్యావసరాల కోసం యూకే వాసుల పాట్లు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ వాసులు పాస్తా, బియ్యం, టాయిలెట్ పేపర్లు లాంటి నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ముందు జాగ్రత్తగా ప్రజలు అధిక మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తుండడం వల్ల సూపర్ మార్కెట్లు దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇతర యూరప్ దేశాల మాదిరిగా బ్రిటన్ విద్యాలయాలను మూసివేయలేదు. పరిస్థితి క్షీణిస్తే మాత్రం వచ్చే వారాంతంలో ప్రజలు గుంపులుగా చేరకుండా బహిరంగ సమావేశాలు నిషేధం విధించాలని భావిస్తోంది. ఇప్పటివరకు బ్రిటన్లో కరోనా వల్ల 21 మంది మృతి చెందగా.. మరో 1,140 మంది వ్యాధి బారిన పడ్డారు.