'ఇంట్లో ఉండండి లేదా ఈ శవపేటికలో ఉండండి' - corona video viral
కరోనా విజృంభన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ ప్రజలు రోడ్లపై తిరగడం మాత్రం మానుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలంటూ ప్రజలకు వినూత్నంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఫిలిప్పీన్స్ పోలీసులు. నడిరోడ్డుపై ఓ శవపేటికను ఉంటి దానిపై 'ఇంట్లో ఉండండి లేదా.. ఈ శవపేటికలో ఉండండి' అని రాసున్న కరపత్రాన్ని అతికించారు. ఫిలిప్పీన్స్ పోలీసులు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.