76వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాలతో నిరసనలు - లెబనాస్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం జెండాలతో నిరసనలు
లెబనాస్ 76వ స్వాతంత్య్ర వేడుకలు దేశ రాజధాని బీరట్‌లో ఘనంగా జరిగాయి. చారిత్రక భవనమైన మాట్రిస్ స్క్వేర్ భవనం రంగురంగుల దీప కాంతులతో వెలిగిపోయింది. సంప్రదాయ పద్ధతిలో అక్కడి సైనిక దళం కవాతు నిర్వహించగా.... అగ్ర రాజకీయ నాయకులు హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవం రోజునా ఆందోళనకారులు దేశ జెండాలను ఉపుతూ నిరసనలు తెలిపారు. అక్టోబర్ 17వ తేదీ నుంచి వాట్సప్ కాల్స్‌పై పన్నులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలాని డిమాండ్ చేస్తున్నారు.
TAGGED:
latest international news