ఫ్లాయిడ్ నిరసనలు: ఇసుకేస్తే రాలనంత జనం! - అమెరికా ఫ్లాయిడ్ నిరసనలు
అమెరికాలో 'బ్లాక్ లివ్స్ మేటర్' ఉద్యమం ఊపందుకుంది. చాలా నగరాల్లో కర్ఫ్యూ ఎత్తివేయడం వల్ల ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. లాస్ ఏంజిలిస్ వీధులు జనాలతో ఆదివారం కిక్కిరిసిపోయాయి. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాలనే నినాదాలతో హోరెత్తాయి.