ఇరాక్ నిరసనలు: సైన్యం కాల్పులతో ఉద్రిక్తత - Iraqi security forces opened fire on protesters
ఇరాక్‌లో రాజకీయ మార్పును కోరుతూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగ సమస్యలే ఇందుకు కారణం. గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బగ్దాద్‌లో ఆందోళన చేస్తున్న వారిపై సైనిక దళాలు కాల్పులు జరిపారు. వీరి చర్యలతో నిరసనకారులు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదువారాలుగా జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 250 మంది ఇరాకీ నిరసనకారులు మరణించారు.