మంచు దుప్పటి కప్పుకున్న ఇరాన్ - Iran covered with ice blanket
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రహదారులు, చెట్లు, వాహనాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆహ్లాదకర వాతావరణంలో మంచుగడ్డలతో.. ప్రజలు, చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. వివిధ రకాల ఆకృతులతో మంచుబొమ్మలను తయారు చేస్తున్నారు.