భారత్, చైనా వాస్తవ లెక్కలు చెప్పవు: ట్రంప్ - అమెరికా ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్- జో బైడెన్ మధ్య తొలి సంవాదం జరిగింది. డిబేట్లో కరోనా అంశంపై చర్చ సమయంలో ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బైడెన్. అమెరికాలో 70లక్షల మందికి కరోనా సోకిందని, 2 లక్షల మంది మరణించారని తెలిపారు. వైరస్ కట్టడిలో ఎలాంటి వ్యూహం లేకపోవడం వల్లే ట్రంప్ దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ విషయంపై ట్రంప్ స్పందించారు. తాను సరైన చర్యలు చేపట్టకపోతే అమెరికాలో 20లక్షల మంది వైరస్‌కు బలయ్యేవారన్నారు. కరోనా చైనాలో పుట్టిందని గుర్తు చేశారు. భారత్, చైనా, రష్యాలో వైరస్ వల్ల ఎంత మంది చనిపోయారనే విషయం ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు. తన చర్యలను సమర్థించుకున్నారు.