స్పెయిన్లో ఆగని కార్చిచ్చు- 9వేల మంది తరలింపు - ఐస్లాండ్
స్పెయిన్ కెనరి దీవుల్లో శనివారం అంటుకున్న కార్చిచ్చు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఎగిసిపడుతున్న మంటలకు 50 మీటర్ల ఎత్తులో నల్లని పోగమంచు అలుముకుంది. 9వేల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 11వేల మంది అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని పర్యటకులు త్వరగా విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. 48 గంటల వ్యవధిలో 6వేల హెక్టార్ల అటవి భూభాగం అగ్నికి ఆహుతైనట్టు అధికారులు ప్రకటించారు.
Last Updated : Sep 27, 2019, 2:59 PM IST