ఉగ్రరూపం దాల్చిన ఇటలీ వరదలు
ఇటలీలోని లిగురియా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. నదులన్నీ వరదల వల్ల ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది.