అల శీతలపురంలో.. ఎక్కడ చూసినా అందాలే! - అదో మంచు సామ్రాజ్యం... కట్టిపడేస్తున్న అందాలు
అదో మంచు సామ్రాజ్యం. ఎక్కడ చూసినా అంతా హిమమయం. నడిచే దారి, కనిపించే ఎత్తైన భవంతులు, అందమైన శిల్పాలు...రకరకాల ఆకృతుల్లో కనువిందు చేసే ప్రతీది అన్నీ మంచుతో తయారు చేసినవే. ఇక చీకటి పడితే చాలు వాటి అందాలు చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. రంగురంగుల కాంతుల మధ్య ఉర్రూతలూగించే సంగీతంతో వినోదభరితంగా ఆనందంగా గడుపుతుంటారు సందర్శకులు. ఇదంతా చైనాలోని హేలాంగ్ జియాంగ్ రాష్ట్రంలో భారీ మంచు శిల్పాల ప్రదర్శనలోని వింతలు. వీటిని తిలకించాలంటే ఈ వీడియో చూసేయండి మరి!