ఉగ్రదాడి మృతులకు ఘన నివాళి - న్యూజిలాండ్
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్, లిన్మోర్ మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 49 మందికి దేశ ప్రజలు నివాళులర్పించారు. క్రైస్ట్‌చర్చ్ ఆసుపత్రి సమీపంలోని ఉద్యానవనంలో అధికారికంగా నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడికి చేరుకున్న వందలాది మంది పుష్పాలు, సందేశాలతో సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడ్డ 48 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.