గడ్డకట్టిన ప్రఖ్యాత జలపాతం... తరలివస్తున్న పర్యటకులు - గడ్డకట్టిన ప్రఖ్యాత జలపాతం...మనసు దోచే అందాలు
చైనాలో ప్రఖ్యాత పసుపు నదిపై ఉన్న హుకౌ జలపాతం గడ్డకడుతోంది. షాన్సీ ప్రావిన్సులో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడం వల్ల జలపాతానికి ప్రధాన ఆధారమైన కొండ కాలువలు ఘనీభవించాయి. సగం గడ్డకట్టిన మంచు పలకలతో ప్రవహిస్తున్న జలపాతం.. పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. హుకౌ జలపాతం ఉన్న చోట పసుపు నది 30 మీటర్ల వెడల్పుతో అధిక వడితో ప్రవహిస్తుంది.