4 నెలల తర్వాత 'ఓషన్ పార్క్'లో సందడే సందడి - హాంకాంగ్‌లో కరోనా సంక్షోభం.
హాంకాంగ్‌లో కరోనా సంక్షోభం వల్ల మూతపడ్డ 'ఓషన్ పార్క్' నాలుగు నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. పార్క్ ప్రారంభమైనట్లు తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ గంటల తరబడి సరదాగా గడిపారు. 1977లో ప్రారంభమైన ఈ పార్క్‌లో పాండాలు, పెంగ్విన్లు, రోలర్ కోస్టర్‌తో పాటు ఇంకా ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నో విశేషాలు ఉన్నాయి.