హాంగ్‌కాంగ్: నిరసనలు మరోమారు హింసాత్మకం - హాంగ్‌కాంగ్
హాంగ్‌కాంగ్‌లో నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచెయ్యకుండా ప్రజాస్వామ్య ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడుతున్నారు. శనివారం హాంకాంగ్‌లోని యోహో షాపింగ్ కేంద్రంలో సమావేశం అయిన నిరసనకారులు.. తొలుత శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. అనంతరం రోడ్లపైకి వచ్చి పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. హాంకాంగ్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ నినదించారు. పోలీసులపై పెట్రోల్ బాంబులను విసిరారు. ప్రతిగా పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.
Last Updated : Oct 1, 2019, 1:33 PM IST