ఐరోపాలో భానుడి భగభగలు- ప్రజల ఇక్కట్లు - ఎండ తీవ్రత
భానుడి ప్రతాపానికి ఐరోపా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ దేశస్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిగాలుల నుంచి ఉపశమనం పొందడానికి తపిస్తున్నారు. ఐస్ క్యూబ్ తొట్టెలను, నీటి కొలనులను ఆశ్రయిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేడిగాలులకు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ్రయులను రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆదుకుంటున్నారు. నీళ్ల సీసాలను పంపిణి చేసి వారి దాహాన్ని తీరుస్తున్నారు.